వాటిల్లో ఈ 'కొన్ని క్షణాల వైభవం' కథ కూడా ఒకటి. కథానిర్మాణంలో పతాకస్థాయిని చిత్రించడానికి ఒక ఉదాహరణగా ఈ కథని వివరించాలని అనుకున్నాను. ఆ వ్యాసాల్లో కొన్ని రాసాను, మిగిలినవి ఇంకా రాయవలసే ఉంది. ఇప్పుడు గూగీ వా థియాంగో (1938-2025) మన మధ్యనుంచి నిష్క్రమించాడు. ఆయనకు నివాళిగా ఈ కథని మీతో పంచుకుంటున్నాను
మన కాలపు మార్కస్ అరీలియస్
ఎందుకంటే, స్టోయిక్కులు చెప్పినట్లుగా ప్రపంచాన్ని మార్చడం మనచేతుల్లో లేని పని. కాని ప్రపంచం పట్ల మన స్పందనలూ, ప్రతి స్పందనలూ మాత్రం మన చేతుల్లో ఉన్నవే. వాటిని మనం అదుపుచేసుకోగలిగితే, మనం ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సమీపించాలో ఆ విధంగా సమీపించగలిగితే, తప్పకుండా మనమున్న మేరకు ప్రపంచం మారడం మొదలుపెడుతుంది. విమర్శ, ఖండన, ద్వేషం, దూషణ చెయ్యలేని పని మన జీవితమే ఒక ఉదాహరణగా మనం చెయ్యగలుగుతాం.
ఆఫ్రికా కవిత
ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యం ప్రధానంగా సామాజిక-రాజకీయ అసమ్మతి సాహిత్యం, నిరసన సాహిత్యం, కోపోద్రిక్త సాహిత్యం. తన పురాతన ఆఫ్రికన్ గతానికీ, దారుణమైన వర్తమానానికీ మధ్య ఆధునికమానవుడు పడిన సంక్షోభానికి, సంఘర్షణకి వ్యక్తీకరణ ఇది. తనెవరో, తన అస్తిత్వం ఏమిటో వెతుక్కుంటూ, గుర్తుపట్టుకుంటూ చేసిన ప్రయాణం అది.
