నా గురించి పాడుకున్న పాట-9

ఒక గడ్డిపోచ కూడా బృహత్తారాసముదాయాల ప్రయాణానికి తక్కువకాదని నమ్ముతాను, ఒక పిపీలికం, ఒక ఇసుకరేణువు, ఒక పక్షిగుడ్డు కూడా అంతే పరిపూర్ణాలు, ఒక చిరుకప్ప ఉత్కృష్ట మహాకావ్యం, ఒక చిట్టీతతుప్ప స్వర్గమందిరాలకు అలంకారం కాగలదు.

నా గురించి పాడుకున్న పాట-8

నేను నడుస్తూ ముందుకు వంగినప్పుడు, అది నిజమేనా అని ఒక్క క్షణం ఆగి నిలబడ్డప్పుడు నా కిటికీ దగ్గర విరబూసిన పువ్వు సమస్త తత్త్వశాస్త్రగ్రంథాల కన్నా నన్నెక్కువ తృప్తిపరుస్తుంది

నా గురించి పాడుకున్న పాట-7

ఓ సముద్రమా! నన్ను నీక్కూడా సమర్పించుకుంటున్నాను- నువ్వేం చెప్తున్నావో గ్రహించగలను నీ తీరం మీద నీల్చుని నన్ను ఆహ్వానిస్తున్న నీ కుటిలాంగుళుల్ని చూస్తున్నాను, నన్ను చేరదీసుకోకుండా నువ్వు వెనక్కి పోడానికి ఇష్టపడవని నాకొక నమ్మకం.