అమెరికన్ మేధావి కర్తవ్యం గురించి ఎమర్సన్ చేసిన ప్రసంగం వల్ల ప్రేరణ పొందిన థోరో మానవసమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా జరిగితే, విట్మన్ మానవసమాజానికి దగ్గరగా జరగడమే కాదు, ఆ మానవాళి మొత్తం తనే కావాలని ఆశపడ్డాడు. అందుకనే ఇది Song of Myself గా మారింది.
ఆత్మోత్సవ గీతం-1
అమెరికాని కీర్తించడానికి, అమెరికన్ ఉత్సవం జరుపుకోడానికి అమెరికా ఒక కవి కోసం ఎదురుచూస్తున్నప్పుడు తాను ఆ కవిగా మారడం ఒక చారిత్రిక, సామాజిక, నైతిక బాధ్యతగా విట్మన్ భావించాడని మనం గ్రహించాలి.
నా గురించి పాడుకున్న పాట-16
నేనిష్టపడే సస్యాలు పెరగటానికి పనికొచ్చే పంకంగా నన్ను నేను మార్చుకుంటాను, నీకెప్పుడేనా నన్ను చూడాలనిపిస్తే నీ అరికాళ్ళకింది దుమ్ములో వెతుకు.
