చిన్ని చిన్ని బాధల్నే అట్లా చటుక్కున మర్చిపోయినప్పుడు అంత హాయి కలుగుతుంటే, మరీ యీ రూపంలేని, పేరు తెలియని మహాబాధ అంతా తొలిగిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? అసలది తొలగిపోవడమంటూ వుంటుందా?
రాజమండ్రి డైరీ-1
నా రాజమండ్రి డైరీలో ఆ సాహిత్యచర్చలు, ఆ పుస్తకాలు, ఆ స్పర్థలు, ఆ మనస్పర్థలు వాటిని దాటి ఆ బృందగానంలోని సంతోషం మీకు నచ్చుతుందేమో అనుకుంటూ కొన్ని పేజీలు మూడు నాలుగు వారాలపాటు మీతో పంచుకుందామనుకుంటున్నాను
మరోసారి స్వాగతం
నా సాహిత్యం ఒక తోట, ఒక కుటీరం. అక్కడ మీరు కొంత సేపు ఆగవచ్చు, అలిసిపోయినప్పుడు సేదదీరవచ్చు. 'కొమ్మల్లో, ఉషఃకాల జలాల్లో తిరిగే గాలిలాంటిది మీ జన్మ, మీ వాక్ స్పర్శ ఈ సత్యాన్నే తెలుపుతోంది ' అని రాసారు శేషేంద్ర ఎన్నో ఏళ్ళ కిందట. ఒక ప్రత్యూషపవనంలాగా నా రచనలు చదువరికి ఇతమిత్థంగా చెప్పలేని ఏదో ఉల్లాసాన్నిస్తాయని నాకు నమ్మకం ఉంది.
