కథల సముద్రం

తెలుగుకథల మీదా, నవలలమీదా, తెలుగులో వచ్చిన అనువాదాల మీదా 2019 నుంచి రాస్తూ వచ్చిన 36 వ్యాసాలతో వెలువరిస్తున్న సంపుటం ఇది. దీన్నిక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పూజ్యులు, కీర్తిశేషులు మునిపల్లె రాజుగారి స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను. ఇది నా 63 వ పుస్తకం.

తీరనిదాహం

అందులో భాగంగా 2019 నుంచి ఇప్పటిదాకా కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఈ సంపుటిగా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.

ఆ వెన్నెల రాత్రులు

ఎప్పుడో 1987 లో మొదలుపెట్టిన నవల. రెండేళ్ళ కిందట పూర్తిచేయగలిగాను. అప్పణ్ణుంచీ ప్రచురిద్దామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అందుకని ఈ వసంతపూర్ణిమ నాడు ఈ పుస్తకాన్నిట్లా మీ చేతుల్లో పెడుతున్నాను. ఇది నా 60 వ పుస్తకం. ఎప్పట్లానే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను.