నాది దుఃఖం లేని దేశం

కబీరు కవిత్వం నుంచి వాడ్రేవు చినవీరభద్రుడు ఏరి కూర్చిన కవితల సంకలనం, అనువాదం. తెలుగులో కబీరుకి సంబంధించి ఇంత సమగ్ర సంకలనం ఇదేనని చెప్పవచ్చు.

హైకూ యాత్ర

సుప్రసిద్ధ జపనీయ హైకూ కవి మత్సువొ బషొ (1644–1694) రాసిన అయిదు యాత్రాకథనాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం. బషొ యాత్రలపైనా, ఈ అనువాదానికి చేపట్టిన పద్ధతులపైనా ఒక సమగ్రవ్యాసం కూడా ఇందులో పొందుపరిచారు.

మనసున మనసై

ప్రసిద్ధ ప్రచురణ కర్త ఎమెస్కో విజయకుమార్ వారి అబ్బాయి నరేన్ పెళ్ళివేడుక సందర్భంగా బాపు వేసిన కొన్ని బొమ్మల్ని కూడా ఒక గుత్తిగా పెళ్ళిపత్రికతో అందించాలనుకున్నాడు. ఆ బొమ్మల్ని చూస్తే భారతీయ కవులూ, యుగాలుగా ప్రవహిస్తున్న భారతీయ కవితాస్రోతస్వినీ కనిపించాయి. అందుకని ఆ బొమ్మలకోసం 5000 ఏళ్ళ భారతీయ కవిత్వం నుంచి కొన్ని మేలిమి కవితల్ని ఎంచి కూర్చిన సంకలనమే 'మనసున మనసై '