ఇండియా టుడే తెలుగు పత్రిక కోరికమీద వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలైన అరకులోయ, శ్రీశైలం,భద్రాచలం ప్రాంతాల యాత్రావర్ణనలు రాసారు. ఆ తర్వాత ఇంగ్లాండు సందర్శించినప్పుడు మరొక సమగ్రమైన యాత్రాకథనం వెలువరించారు. ఆ కథనాలకు, మరికొన్ని అనుభవకథనాలు జోడించి 2010 లో వెలువరించిన యాత్రాగ్రంథం 'నేను తిరిగిన దారులు.'
అరణ్యం
వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన అరణ్యం నవలని నండూరి రామ్మోహనరావుగారు ఆంధ్రజ్యోతి దినపత్రికలొ డెయిలీ సీరియల్ గా ప్రచురించారు.
ప్రశ్నభూమి
1980-90 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన 12 కథల సంపుటి.
