సాహిత్యవిశ్లేషణ లో భాగంగా 2000 నుంచి 2009 మధ్యకాలంలో రాసిన వ్యాసాలు,ముందుమాటలు, సమీక్షలు, ప్రసంగపాఠాలు ఏరి కూర్చిన సంపుటం. ఈ పుస్తకం పూజ్యులు శ్రీ సి.వి.కృష్ణారావుకి అంకితం.
సాహిత్య సంస్కారం
2010 నుంచి 2017 మధ్యకాలంలో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు 'సాహిత్య సంస్కారం' పేరిట ఎమెస్కో ప్రచురణగా వెలువడ్డాయి. ఈ పుస్తకంలోని 64 వ్యాసాల్లో కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యప్రక్రియలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక అధ్యయనాలకు సంబంధించిన గ్రంథాల పరిశీలన ఉంది.
సహృదయునికి ప్రేమలేఖ
1985-2000 మధ్యకాలంలో వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన వివిధ సాహిత్య ప్రశంసాత్మక వ్యాసాల నుంచి ఏరి కూర్చిన వ్యాసాల సంపుటి.
