మొత్తం అరవై నాలుగు గీతాలకు తెలుగు అనువాదాల్నీ, విపులమైన ఒక పరిచయ వ్యాసంతో కలిపి ఇప్పుడు ఈశ్వర స్తుతిగీతాలు పేరిట ఇదుగో ఇలా మీకు అందిస్తున్నాను. ఇది నా 48 వ పుస్తకం.
ముప్ఫై ఏళ్ళ తర్వాత
కాని కవిత్వం ఒక దీపం వెలిగించడం లాంటిది. ఒకసారి ఒక కాంతికిరణం ఈ లోకంలో ప్రభవించాక అగణ్య కాంతిసంవత్సరాల పాటు అదట్లా ప్రయాణిస్తోనే ఉంటుంది. ఎక్కడో, ఎవరో ఒక పాఠకుడు దాన్ని పట్టుకునేదాకా. అటువంటి సహృదయుడు ఉండితీరతాడన్న నమ్మకం ఉండబట్టే భవభూతి 'పృథ్వి విశాలం, కాలం అనంతం' అన్నాడు.
ఆధునిక ఇతిహాసం
అందుకని ఆ గీతానికి నా అనువాదం 'ఆత్మోత్సవ గీతం' పేరిట, ఇదుగో, ఇలా ఈ-బుక్ గా విడుదల చేస్తున్నాను. ఇది నా 47 వ పుస్తకం.
