పుస్తక పరిచయం-56

నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఈ ఫిబ్రవరిలో ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నాలుగు ప్రసంగాలు చేసాను. ఆ సాహిత్యకారుల గురించి స్థూలంగా ముచ్చటించుకోడానికేనా మరో నాలుగు ప్రసంగాలు అవసరమవుతాయి. కాని మనం మార్చి నెలలో ప్రవేశించాం కాబట్టి ఈనాటి ప్రసంగంతో నల్లజాతి చరిత్ర మాసోత్సవం పూర్తిచేస్తున్నాను. ఈ రోజు పాల్ రోబ్సన్, మాయా ఏంజిలో, రాల్ఫ్ ఎల్లిసన్, టోనీ మారిసన్ ల గురించి స్థూలంగా పరిచయం చేసాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

పుస్తక పరిచయం-55

నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన చేస్తున్న ప్రసంగాల్లో ఇది నాలుగవది. గత వారం లాంగ్ స్టన్ హ్యూస్ గురించి చేసిన చర్చను కొనసాగించడంతో పాటు, రిచర్డ్ రైట్, లొరైన్ హాన్స్ బెర్రీ, పాల్ రోబ్సన్ ల గురించి కూడా ఈ రోజు ప్రసంగించాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

పుస్తక పరిచయం-54

ఈ ఫిబ్రవరి నెలని నల్ల జాతి మాసోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన నేను చేస్తున్న ప్రసంగాల్లో ఇది మూడవది. ఈ రోజు విలియం ఎడ్వర్డ్ డుబ్వా గురించి, ఆఫ్రికన్ బానిస గీతాల గురించీ, లాంగ్ స్టన్ హ్యూస్ గురించీ మాట్లాడాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.