మందం మందం మధుర నినదైః

ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.

ఒక జీవితజయగాథ

ఇవన్నీ విన్నాక విజయభాస్కర్ ని ఆయన జీవితానుభవాలు కూడా ఒక పుస్తకంగా వెలువరించమని అడిగాను. నేటి కాలానికి, నేటి దేశానికి కావలసింది ఇటువంటి జీవితాలూ, ఇటువంటి జీవితచరిత్రలూనూ.

నిజంగా భాగ్యం

ఈ నెల రెండో తేదీన రావిశాస్త్రి పురస్కారవేదిక సభలో నా 'కథలసముద్రం' పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా డా.కొర్రపాటి ఆదిత్య ఆ పుస్తకాన్ని పరిచయం చేసారు. ఒక తరానికి చెందిన రచయితకి తన తర్వాతి తరం నుంచి ఇటువంటి మూల్యాంకనం దొరకడం నిజంగా భాగ్యం