నా భాగ్యం

ఈ గీతాన్ని ఆత్మీయురాలు నిర్మలకి కానుక చెయ్యడం కూడా భగవత్సంకల్పంగానే భావిస్తున్నాను. రెండువేల అయిదు వందల ఏళ్ళ యూదీయ, క్రైస్తవ, భగవద్విశ్వాసుల ఆశీస్సులు ఆమెకు ఈ రూపంలో అందుతున్నాయని నమ్ముతున్నాను. ఈ పుస్తకానికి ఆమెనే మొదటి పాఠకురాలు కూడా. ఆమె తన స్పందనను ఇలా పంచుకున్నారు. ఈ కానుకని ఆమె అంగీకరించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.

తెలంగాణా హెరిటేజి మూజియం

అమెరికాలో ఇటువంటి మూజియాలకీ, చిత్రకళాప్రదర్శనలకీ ఎంత ఆదరణ ఉంటుందో స్వయంగా చూసిన విజయసారథిగారు ఆ మూజియంలో తిరుగుతున్నంతసేపూ దిగులు పడుతూనే ఉన్నారు. ఏం చేస్తే మన ప్రజలకి ఇటువంటి విలువైన వారసత్వసంపద పైన దృష్టి మళ్ళుతుంది? ఒక మాల్ కో, మల్టీప్లెక్సుకో పిల్లల్ని తీసుకువెళ్ళడంలో సంతోషాన్ని పొందుతున్న మన కుటుంబాలకి తమ పిల్లలని ముందు ఇటువంటి మూజియంలకు తీసుకురావడం అత్యవసరమని ఎప్పుడు తెలుస్తుంది? ఇవే ఆయన నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలు.

దేవలోకపు విరజాజులు

వర్ష ఋతువు ముగిసేలోపే ఇలా ఆ మున్నీరు ఒక సహృదయాకాశపు మిన్నేరుగా మారి తిరిగి పన్నీరుగా కురుస్తుందని అనుకోలేదు. ధన్యవాదాలు చిన్నమాట మానసా! ఇలా ఒక్కరు చదువుతున్నా కూడా ప్రపంచ సాహిత్యమంతా తీసుకొచ్చి కుమ్మరించాలనిపిస్తుంది.