మరోసారి ఇల్లు మారాం. భారతీయ రచయితల్లో ప్రేమ్ చంద్ తర్వాత ఎక్కువ ఇళ్ళు మారింది నేనేనని రాళ్ళబండి కవితాప్రసాద్ అన్నాడు.రాజధాని మారిపోయే వేళ మళ్ళా ఇల్లు మారడమేమిటన్నారు కొందరు. కానీ మారక తప్పింది కాదు. ఎన్నాళ్ళు ఉంటామో కాని, ఇంటి చుట్టూ ఉన్న కొద్దిపాటి ఖాళీస్థలంలోనూ ఒక అందమైన పూలతోట పెంచుకోవచ్చన్న కోరిక నన్నూరించింది.
బాలాంత్రపు రజనీకాంతరావు
నిన్నసాయంకాలం గుంటూరులో వైశ్య హాస్టల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున బాలాంత్రపు రజనీకాంతరావుగారికి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆ సత్కార సభలో రజనీకాంతరావుగారితో వేదిక పంచుకోవడమే కాక, ఆయన గురించి మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు రజనీకాంతరావుగారిమీద ప్రచురించిన విశేష సంచిక 'రజని ' నీ అవిష్కరించే అదృష్టం కూడ కలిగింది.
డా.నన్నపనేని మంగాదేవి
2016 సంవత్సరానికి గాను జమ్నలాల్ బజాజ్ పురస్కారం డా.నన్నపనేని మంగాదేవికి గారికి లభించిందని తెలిసినప్పటినుంచీ ఆమె దగ్గరకి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటూనే ఉన్నాను. నిన్నటికి ఆ అవకాశం లభించింది.
