ఈ నెల 3 వ తేదీన లా మకాన్ లో అనంతమూర్తిమీద ఒక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తూ నన్ను కూడా మాట్లాడమని అడిగినప్పుడు, సంస్కార కన్నా గొప్ప రచనలు తెలుగులో వచ్చినప్పటికీ వాటి గురించి తక్కిన ప్రపంచానికి తెలియడం లేదని అన్నాను. ఆ మాటల మీద కొంత చర్చ జరిగింది.
సౌందర్యోపాసకుడు
ఆదివారం తెనాలిలో సంజీవదేవ్ శతజయంతి సభ. సాహిత్య అకాదెమీ నిర్వహించిన సభలో రోజంగా సంజీవదేవ్ కృషిమీద పెద్దలెందరో పత్రాలు సమర్పించారు. సాయంకాలం జరిగిన సమాపనోత్సవంలో సమాపనోపన్యాసం చేసే అరుదైన గౌరవం నాకు లభించింది.
రమణా సుమనశ్రీ అవార్డు
26 సాయంకాలం గోల్డెన్ త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రసిద్ధ కవి, ఆత్మీయమిత్రుడు సుమనశ్రీ కె.శివారెడ్డి ఇటీవలి కవితాసంపుటి 'గాథ ' కీ, నా కవితా సంపుటం 'నీటిరంగుల చిత్రం ' కీ రమణా సుమనశ్రీ అవార్డులు అందించాడు. ఆ సత్కార సమావేశానికి మరొక ప్రసిద్ధ కవి, భావుకుడు దీవి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.
