ఒకప్పుడు కల్నల్ కాలిన్ మెకంజీ సేకరించిన రచన అది. దాన్ని దాన్ని బ్రౌన్ ఇంగ్లీషులోకి అనువదించి 1853 లో ప్రచురించాడు. ఇన్నేళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని గాయత్రి ప్రచురణలు, అనంతపురం వారు మళ్ళా వెలుగులోకి తీసుకువచ్చారు.
అతడు వదులుకున్న పాఠాలు
కందుకూరి రమేష్ బాబు నాకు పదేళ్ళుగా తెలుసు. అతడు రాసిన 'కోళ్ళ మంగారం, మరికొందరు' (2006) తో పాటు మరొక రెండు పుస్తకాలు, 'బాలుడి శిల్పం', 'గణితం అతడి వేళ్ళ మీద సంగీతం', కూడా సమీక్ష చెయ్యమని వసంతలక్ష్మిగారు నాకు పంపిస్తూ అతడి గురించి నాలుగైదు మాటలు కూడా చెప్పారు.
అమేయమైన మెర మెర
'ద:ఖనీ పీఠమంతా బొమ్మలబాయి ' అంటో సిద్ధార్థ తెచ్చిన కొత్త కవితాసంపుటి 'బొమ్మల బాయి' చదువుతుంటే, కవి మాటల్లోనే చెప్పాలంటే 'జీవిలోపల చెయ్యిపెట్టి తిప్పుతున్నట్టు ఒక అమేయమైన మెర మెర '.
