కొంత సేపు ప్రేమ, కొంతసేపు పని

ప్రేమ వ్యవహారమో లేదా తామే వ్యవహారం చేపడితే దాన్నే ప్రేమించేవాళ్ళో గొప్ప అదృష్టవంతులు. నేనో! కొంత సేపు ప్రేమ, కొంతసేపు పని-ఇట్లానే బతుకంతా గడిపేసాను. పని ప్రేమకి అడ్డొచ్చేది, ప్రేమ పనికి అడ్డమయ్యేది. చివరికి విసిగిపోయి, ప్రేమనీ, పనినీ, రెండింటినీ సగంసగంలోనే, వదిలేసాను

నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు

మిత్రులారా, మీ దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నా,అత్యద్భుతమైన పుస్తకాలు దొరికే చోటు నేషనల్ బుక్ ట్రస్ట్ వారి స్టాలు. అక్కడ కురతలైన్ హైదర్ రాసిన 'అగ్నిధార' దొరుకుతుంది. కురతలైన్ అగ్రశ్రేణి ఉర్దూ రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త.

బైరాగి 90వ పుట్టినరోజు

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు బైరాగి కవిత్వాన్ని ఇష్టపడతారనీ, బైరాగినీ,ముక్తిబోధ్ ని పోలుస్తూ పరిశోధన చేసారనీ తెలుసు నాకు. కాని బైరాగి కవిత్వాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తారని మొన్నే తెలిసింది నాకు.