అమృతానుభవం

అనుభవామృతాన్ని తెలుగు చేయడానికి రాధాకృష్ణమూర్తిగారికన్నా తగినవారు ఎవరుంటారు? ఉపనిషత్తులూ, భగవద్గీతలతో పాటు ఆధునిక పాశ్చాత్య చింతనని కూడా సాకల్యంగా అర్థం చేసుకుని సమన్వయించుకోగలిగిన ఆ వేదాంతి చేతులమీదుగా వెలువడటం కోసమే ఆ పుస్తకం ఇన్నాళ్ళుగా నిరీక్షిస్తూ ఉన్నదని అర్థమయింది

ప్రథమ వాచకం, పెద్ద బాలశిక్ష

తన సంకలనాన్ని 'స్త్రీలకు ప్రథమ వాచకం అనీ, పురుషులకు పెద్ద బాలశిక్ష' అనీ సంకలనకర్త రాసుకున్నాడు. అయితే ఈ వాచకాన్నీ, ఈ పెద్దబాలశిక్షనీ నలుగురూ చదివేలా చేయవలసిన బాధ్యత మాత్రం మనదే.

ఈస్తటిక్‌ స్పేస్‌ స్టేషన్‌

ఈస్తటిక్‌ స్పేస్‌ కథలో కథకుడు ఒక మాటన్నాడు. ''మనుషులు స్పేస్‌ లో స్టేషన్లు నిర్మించి నివాసం ఉంటున్నారు గాని, తమలో దాగి వున్న ఈస్తటిక్‌ స్పేస్‌ విలువని గుర్తించడం లేదు'' అని. అందుకని మనకోసం కథకుడు నిర్మించిన ఒక ఈస్తటిక్‌ స్పేస్‌ స్టేషన్‌ ఈ కథాసంపుటం.