మా రాజమండ్రి మిత్రుల జ్ఞాపకంగా వారందరి తరఫునా ఆ పుస్తకం నేనందుకున్నాను అనుకున్నాను. సుబ్బు, మహేశ్, సావిత్రిగారు, శరత్ బాబు, రామనాథం లతో పాటు ఏమైపోయాడో తెలియని గోపీచంద్ కూడా నిన్న రాత్రి నా తో పాటు అక్కడున్నారని గుర్తుపట్టాను.
జీవన వ్రత కథ
ఇది వ్రత కథ కూడా. జీవనవ్రత కథ. దీనికి ఒక ఫలశ్రుతి కూడా ఉంది. పుస్తకం ముగించేక మీరు చెయ్యవలసింది నలుగురికి భోజనం పెట్టడం, నలుగురితో కలిసి విందు ఆరగించడం.
కొన్ని శేఫాలికలు
ఎందుకని? ఎందుకని ఈ వాక్యాలు, ఈ వ్యాసాలు నాకు కన్నీళ్ళు తెప్పించాయి? వీటిలో ఉన్నదేమిటి? సాహిత్యం, సంగీతం, సినిమాలు, మిత్రులు, మానవసంబంధాలు- వీటిగురించే అయితే సంతోషం కలిగి ఉండాలిగాని హృదయం అశ్రుపూరమెందుకవ్వాలి?
