లబ్ధ ప్రతిష్టులెందరో ఆ సంస్థ పురస్కారం తమకి లభించడం తమకి గౌరవంగా భావిస్తూ ఉన్నారు కూడా. అయితే మొదటిసారిగా ఈ సంస్థ ఒక గిరిజన రచయితకు ఈ పురస్కారం ప్రకటించి తన గౌరవాన్ని ఇనుమడించుకుందని భావిస్తున్నాను
ప్రతిభావంతమైన రచన
కాని ఒక నవల విజ్ఞానసర్వస్వం కాదు. అందులో పాత్రల మధ్య సంబంధాలు రసమయంగా చిత్రించబడ్డప్పుడే పాఠకుడి హృదయాన్ని తట్టగలుగుతుంది. ఈ రచనలో అటువంటి రసమయఘట్టాలు అడుగడుగునా ఉన్నాయి. అందువల్లనే ఒకసారి చేతుల్లోకి తీసుకున్నాక, ఈ రచనని పాఠకుడు పక్కన పెట్టడం కష్టం.
నూరు శరత్తులు జీవించండి
ముకుంద రామారావు గారికి అజో-విభొ-కందాళం సంస్థ వారు, 2024 కు గాను జీవితకాల సాధన పురస్కారం అందించారని తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. గొంతు ముప్ఫై ఏళ్లుగా ఆయన కవిగా, అనువాదకుడిగా, ప్రపంచ సాహిత్య పరిచయకర్తగా తెలుగు సాహిత్యంలో చేస్తూ వచ్చిన కృషి అద్వితీయం.
