ఆ పల్లె, ఆ యేరు, ఆ పద్యాలు

ఆ పల్లె, ఆ నల్లని యేరు, ఆ పచ్చికబయళ్ళు, ఆ లేగదూడలు, ఆ వల్లెవాటు, ఆ పిల్లనగ్రోవి, ఆ ఓరచూపులు ఆ పింఛం, ఆ ఓరమోము- అబ్బా! ఇది ఏ గుడికి చెందిన కృష్ణుడి గురించిన పద్యం? మా ఊళ్ళో కృష్ణుడికి ప్రత్యేకంగా ఏ గుడీ లేదుగాని, ఆ పల్లె, ఆ ఏరు, ఆ లేగలూ, ఆ నెమళ్ళూ మా ఊరివి కావా!

నాయని సుబ్బారావు

తల్లి, పడతి, కొడుకు, కన్న ఊరు- ఒక మనిషి జీవితం తిరిగేది వీటి చుట్టూతానే. ఆ నాలిగింటితోటీ తన అనుభవాల్నీ, అనుభూతినీ కవిత్వంగా మార్చిన ఏకైక తెలుగు కవి నాయని సుబ్బారావు. నిజమైన స్వానుభవ కవి.

చందవరం

కాని ఆ చిన్న గుట్ట ఎక్కి, ఆ శిథిలారామం చెంత నిలబడే క్షణానికి ఆకాశం సాయంసంధ్యా వర్ణాల్ని ధరించింది. ఎదురుగా గుండ్లకమ్మ.