బహుశా మనం ఇప్పటిదాకా కలుసుకుంటూ వస్తున్న సమయాల్లో నిన్నటి సాయంకాలం లాంటి సమయం మరొకటి ఉండదని చెప్పగలను.
ఆ సూర్యకాంతి మరికొంచెం
దూషించడమూ, ద్వేషించడమూ తీరికసమయపు వ్యాపకాలుగా మారిపోతున్న కాలంలో మీలాంటి ఇద్దరు మిత్రులు నా రచనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్న మాట నాకెంత బలాన్నిచ్చిందో చెప్పలేను. అది నాకు చెప్పలేనంత బాధ్యతని కూడా అప్పగించింది.
పట్టపగలే వెన్నెల
ఆ క్షేత్రం ఒక పూట వెళ్ళి వచ్చేదికాదనీ, కనీసం ఒక వెన్నెల రాత్రి, ఒక శుభప్రభాతం అక్కడ ఉండవలసిందనీ అనిపించింది.
