నేనా రోజు ఆ అర్థశాస్త్రవేత్తలకి ఆ కథంతా చెప్పి ' ఈ దేశంలో బీదరికం ఎవరి పాపం అని అడుగుతున్నారు కదూ. ఈ ఘోరాన్ని చూస్తూ తలకొక మాటా మాట్లాడుతున్న మీదే ఈ పాపమంతానూ' అన్నాను.
మరికొన్ని మంచిమాటలు
గురూజీ గురించి తలుచుకోవలసింది, ఆయన చెప్పిన మాటల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకోవలసిందీ చాలా ఉంది. కొన్ని కొన్ని మాటలమీద కొన్నేళ్ళ పాటు చర్చించుకోవలసి ఉంటుంది. దలైలామా సహచరుడైన రింగ్ పోచే కళాశ్రమాన్ని చూసి 'మీరు గాంధీజీ హింద్ స్వరాజ్ పుస్తకంలో ఏమి రాసారో అచ్చం అలానే జీవిస్తున్నారు ' అని అన్నాడట.
శాంతివనం: అనుభవాలు, ప్రయోగాలు
'అరుగులన్నిటిలోను ఏ అరుగు మేలు' అని అడిగితే 'పండితులు కూర్చుండు మా అరుగు మేలు' అన్నట్టు, పోరాటాలన్నిటిలోనూ, ఏ పోరాటం గొప్పదని అడిగితే, విద్యకి సంబంధించిన పోరాటాలూ, ప్రయత్నాలే సర్వోన్నతమైనవని నమ్ముతాను నేను.
