శ్రీకాకుళం జిల్లా సవరసమాజంలో గత ఇరవయ్యేళ్ళుగా పాదుకొంటున్న అక్షరబ్రహ్మ ఉద్యమం గురించి తెలుసుకోవాలన్న కోరిక నాకు చాలా బలంగా ఉండిందిగానీ, ఇంతదాకా ఆ అవకాశం కలగలేదు. అందుకని రెండురోజులకిందట శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐ.టి.డి.ఏ కి వెళ్ళినప్పుడు, దగ్గరలో ఏదైనా ఒక సవరగూడలో అక్షరబ్రహ్మ కార్యక్రమం చూడాలని ఉందనగానే సహాయ ప్రాజెక్టు అధికారి నాగోరావు నన్ను నౌగడ గ్రామానికి తీసుకువెళ్ళాడు.
21 వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు
విద్య గురించిన ఆలోచనలు నన్ను గాఢంగా ఉత్తేజితుణ్ణి చేస్తుంటాయి, సాహిత్యంలానే. కానీ, ఒక తేడా ఉంది. సాహిత్యం చదవడం, చదివినపుస్తకాల గురించి మాట్లాడుకోవడం, ఒక కవితనో కథనో రాయడం ఎప్పటికీ ఉత్తేజకారకాలేగాని, విద్య అట్లా కాదు. విద్యామీమాంస నన్ను ఎంత ఉత్తేజితుణ్ణి చేస్తుందో, అంత చింతాక్రాంతుణ్ణి కూడా చేస్తుంది.
ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018
ప్రపంచబాంకు ప్రతి ఏటా వెలువరించే ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018 వ సంవత్సరానికి వెలువడింది. 1978 నుంచీ వెలువరిస్తున్న ఈ నివేదికల పరంపరలో బాంకు విద్య గురించి మొదటిసారిగా వెలువరించిన నివేదిక ఇది. మారుతున్న ప్రపంచ సామాజిక-ఆర్థిక గతిని ఎప్పటికప్పుడు ఎంతో నిశితంగానూ, లోతుగానూ పట్టుకోవడమే కాక, ప్రపంచదేశాలకూ, రాజకీయ విధాననిర్ణయవేత్తలకూ మార్గదర్శకంగా ఉండే ప్రపంచబాంకు తన వార్షిక అభివృద్ధి నివేదికల్లో ఇంతదాకా విద్య గురించి మాట్లాడవలసినంతగా మాట్లాడకపోవడమే ఒక ఆశ్చర్యం.
