గ్రామీణ ఉపాధ్యాయుడు ఒక నిష్ఠుర, ఏకాంత ప్రపంచంలో కూరుకుపోయి తననొక అభిశప్తుడిగా భావించుకుంటూ ఉన్నాడు. అతణ్ణి సమీపించి, అతడు చేస్తున్న పని చూసి, అతడి భుజం తట్టడానికి ప్రభుత్వానికి సమయం లేదు. ప్రభుత్వానికి లెక్కలు కావాలి. అంకెలు కావాలి. కాని, పాఠశాలలకి ఉత్సాహం కావాలి, ఉత్తేజం కావాలి. అదివ్వగలిగినవాళ్ళు ఎవరు? ఎక్కడున్నారు?
దారిచూపే పుస్తకం
ఇట్లాంటి పుస్తకం మనలాంటి దేశాలకీ, సంస్థలకీ, కుటుంబాలకీ చాలా అవసరం. ముఖ్యంగా నిధులు, వనరులు చాలినంతగా లభ్యంగాని మన సమాజాల్లో మార్పు సాధ్యం కావడానికి మన ఆలోచనల్లో, అలవాట్లలో, ఆచరణలో ఎట్లాంటి కొత్త పద్ధతులు సాధ్యం కావచ్చో ఆ పుస్తకం మనలో ఆలోచన రేకెత్తిస్తుంది.
స్పష్టంగా చెప్పగలిగేనా?
ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త జాతీయతాధోరణిని సంతరించుకుంటున్న రాజకీయవాతావరణం ఏర్పడుతున్నది. ఇది కొత్త పరిణామంగా కనిపించవచ్చుగాని, ఆదినుంచీ భారతదేశ చరిత్రని నిశితంగా పరిశీలించినవాళ్ళకి, ఈ పరిణామంలో చరిత్ర పునరావృత్తి కనిపిస్తుంది.
