ఆర్చిస్ 300 జిఎస్ ఎం 10x 25 సెం.మీ వాటర్ కలర్ పాడ్ ఒకటి కొని చాలా రోజులయ్యింది. 20 షీట్ల పాడ్. ఈ సైజులో ఎటువంటి బొమ్మలు గీయవచ్చో తెలియక ఈ పాడ్ చాలారోజులు అలానే అట్టేపెట్టేసాను. ఇప్పుడు ఉన్నట్టుండి రెండు రోజులుగా ఈ పాడ్ కి పూలు పూస్తూ ఉన్నాయి. వాటిని మీకు చూపించకుండా ఎలా ఉంటాను!
A Rainy Day
A Rainy Day, Daniel Smith Watercolors, Scholar 300 gsm
ఉండవల్లి గుహల దగ్గర
అక్కడ పూర్తిగా శిథిలమైపోగా మిగిలిన ఒక ఏనుగు ముఖాకృతిలో ఉండే స్తంభాన్ని గియ్యబోతే, ఆ ఏనుగూ, దాని కుంభస్థలమూ, ఆ నేత్రమూ, ఆ దంతమూ- కొన్ని శతాబ్దాల కిందట ఆ శిల్పి వాటిని తీర్చిదిద్దినప్పుడు, అతడి వేళ్ళకి ఏ సౌకుమార్యం అనుభూతికి వచ్చి ఉంటుందో అది మళ్ళా నా వేళ్ళకి కూడా అందినట్టనిపించింది.
