చలిగాలి చలిగాలి తొలివానగాలి ఏ కొలిమితిత్తుల మంటదో, ఈ చలిగాలి చలిగాలి తొలివానగాలి.
సంగీత పత్రిక
ఇవన్నీ రాస్తున్నానుగాని, నిజానికి నా ఉద్దేశం, ఇటువంటి ఒక సంగీత పత్రిక, అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న పత్రిక ఒకటి ఉందన్న వార్త మీతో పంచుకోవడమే. ఆలస్యమెందుకు? వెంటనే ఈ సంగీతమయప్రపంచంలో అడుగుపెట్టండి
సుకృతుడు
గంగా, యమునా జలాల మీంచి వీచేగాలుల్తో పాటు, సాయంకాలపు నమాజ్ వినిపించే సంధ్యాకాంతితో పాటు, దేవాలయాల్లో పొద్దుటిపూట అల్లుకునే ఒక మంగళమయసునాదంతో అతడి సంగీతం నిండిపోయి ఉందని తెలియడానికి మనకి హిందుస్తానీ సంగీత పరిజ్ఞానంతో ఏమీ పనిలేదు.
