మన జీవితాలు పాశ్చాత్యీకరణ చెందుతున్న క్రమంలో అన్నిటికన్నా ముందు మనం మన దేవీదేవతలను పోగొట్టుకున్నాం. నలుగురిముందూ మనం పోగొట్టుకుంటున్న ఆ విహ్వల క్షణంలో కృష్ణా అని పిలిస్తే పరుగుపరుగున చీరలు పట్టుకొచ్చే ఒక ఆత్మీయసన్నిధిని పోగొట్టుకున్నాం.
జయభేరి
ఆ కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమి పాడేరో, మాట్లాడేరో నాకేమీ గుర్తు లేదుగానీ, ఆ రాత్రంతా మా మీద ధారాళంగా వర్షించిన వెన్నెల తడి ఇప్పటికీ నా వీపుకి అంటుకునే ఉంది.
సర్దార్ ఉద్ధం సింగ్
అప్పుడు ఆ పుస్తకం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అది పంజాబ్, సింధ్ ప్రజాహృదయాల్లో అమరత్వాన్ని పొందిన ప్రేమికులు హీర్-రాంజాల ప్రేమకథ. ఆ పుస్తకం కనిపించగానే నా ఒళ్ళు గగుర్పాటుకు లోనయ్యింది. నాకు ఆ క్షణంలో బాబా బుల్లేషా ప్రత్యక్షమయినంత పులకింత కలిగింది.
