ఈ రోజు క్రైస్తవం ప్రపంచవ్యాప్త విశ్వాసంగా రూపొందడానికి తొలిక్రైస్తవుల ఆత్మత్యాగాలే ప్రధాన కారణం అనుకుంటే వాళ్ళనట్లా త్యాగమయుల్ని చేయగలిగింది మత్తయి సువార్తనే.
బయటపడాలి
ముఖ్యంగా నువ్వు నీ తోటి మనిషిని నీ ప్రయత్నాల్లో ఒక భాగంగా స్వీకరిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అతణ్ణి నియంత్రించడానికి పూనుకుంటావన్న ఎరుక కలగగానే అది నిన్ను పెట్టే ఆత్మ హింస సాధారణంగా ఉండదు.
ఆ దేవదా, ఆ పారు, ఆ చంద్ర
దేవదాసు కింగ్ లియర్ లాంటి కథ. దాన్ని ఒక కాలానికి కట్టిపడెయ్యలేం. అది ప్రేమరాహిత్యం తాలూకు కథ. ఏ కాలంలో కుటుంబసంబంధాలు మర్యాదసంబంధాలుగానూ, పెళ్ళిళ్ళు పరువువ్యవహారాలుగానూ ఉంటాయో, అటువంటి ప్రతికాలంలోనూ దేవదాసులు పుట్టుకొస్తూనే ఉంటారు.
