ఒక ప్రయోగశీలి

ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు ఒక కవిని ఇంటికి వెళ్ళికలుసుకుంటే ఆ రోజు ఆకాశంలో ఎగిరి వచ్చినట్టుంటుంది. ఒక చిత్రకారుణ్ణి అతని స్టూడియోలో కలుసుకుని వస్తే గరుత్మంతుడిలాగా నాక్కూడా ఇంత అమృతాన్ని దొంగిలించి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది.

అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి

ఒకప్పుడు హళేబీడు, రామప్ప వెళ్ళినప్పుడు ఆ శిల్పులు రాతిని వెన్నగా మార్చి శిలని సంగీతంగా వికసింపచేసారని రాసుకున్నాను. కాని మన కాలంలో మన ఒక చిత్రకారుడు ఇలా ఒక దారుఖండాన్ని ఒక విష్ణుస్తుతిగా మార్చడం నా కళ్లారా చూడగలనని ఎన్నడూ అనుకోలేదు.

ఎన్నదగ్గ చిత్రకారిణి

చిత్రలేఖనం నేర్చుకోవాలనుకునేవారికి స్టిల్ లైఫ్ చిత్రలేఖనం గొప్ప అభ్యాసం. అందులో తలమునకలయ్యేవారికి అదొక గొప్ప సవాలు. ఆ సవాలును స్వీకరించేవారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన చిత్రలేఖకుల కోవలో కిరణ్ కుమారి ముందు వరసలో ఉంటారు.