యావత్ప్రపంచపు ఆస్తి

ఆ మొదటి ప్రపంచానికీ ఈ రెండో ప్రపంచానికీ పోలికనే లేదు. మొదటి రెండు హాళ్ళల్లోనూ నడుస్తున్నంతసేపూ గంభీరమైన పద్యాలు వింటున్నట్టుంది. కాని ఈ హాల్లో తిరుగుతున్నప్పుడు తెలంగాణా పల్లెపాట వింటున్నట్టుంది.

ఆయన చిత్రాలు తెలుగువాళ్ళ సంపద

ఒక గ్రామం మొత్తం పూనుకుంటేనే ఒక మనిషి విద్యావంతుడవుతాడని ఒక ఆఫ్రికన్‌ సామెత. ఒక నగరం మొత్తం పూనుకుంటేనే ఒక పౌరుడు విద్యావంతుడవుతాడని పూర్వకాలపు గ్రీకులు భావించేవారు. డా.కొండపల్లి శేషగిరిరావుగారి జీవితప్రయాణాన్ని దగ్గరగా చూసినవాళ్ళకి ఒక దేశం మొత్తం పూనుకుని ఆయన్ని చిత్రకారుడిగా రూపొందించిందని అర్థమవుతుంది.

రూపాన్వేషి, మార్గదర్శి

బి.ఎ.రెడ్డి ఒక చిత్రకారునిగా, ఒక ఉపాధ్యాయునిగా సాధించిన అద్వితీయత విశిష్టమైంది. అందులో ఆయన చిత్రకారునిగా చూపిన అద్వితీయత ప్రశంసించదగ్గది. ఉపాధ్యాయునిగా చూపిన అద్వితీయత ప్రస్తుతించదగ్గది.