ఆ వెన్నెల రాత్రులు-13

అంతా స్ప్రింగ్ సీజన్ గురించి మాట్లాడతారు. కాని మాఘమాసం చెట్లు నెమ్మదిగా నిద్రమేల్కొనే మాసం. ఫాల్గుణం వాటి ప్రభాతం. ఈ రెండు మాసాల్లోనే అడవి, చెట్లు, మొగ్గలు, పువ్వులు, పక్షులు, సమస్త ప్రకృతి మేల్కొనే వేళ. అందుకే నజ్రుల్ అడుగుతున్నాడు, నా తోటలో గొంతువిప్పిన ఆ పక్షివి నువ్వేనా?నువ్వేనా?

ఆ వెన్నెల రాత్రులు-12

ప్రేమ కూడా ఒక సింబాలిక్ కమ్యూనికేషన్. అది ఒక మనిషి తనకై తాను నిర్మించుకునే ఒక సింబాలిక్ వరల్డ్. ఆ భాష మరొక మనిషికి అర్థమయిందనుకో, వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అంటాం. లేదనుకో, అతనేం చెప్తున్నాడో ఈమెకి ఎప్పటికీ అర్థం కానే కాదు.

ఆ వెన్నెల రాత్రులు-11

కానీ ఆ ఊరు అలాంటిది. అక్కణ్ణుంచి బయటి ప్రపంచంలోకి రావాలంటే మామూలు బలం చాలదు. భూమ్యాకర్షణ శక్తిని దాటి ఒక మనిషి తనంతతాను రోదసిలోకి ఎగరడం ఎంత కష్టమో, ఆ ఏరూ, ఆ కొండలూ, ఆ గాలీ, ఆ వెలుగూ మనమీద విసిరే వలనుంచి బయట పడటం కూడా అంతే కష్టం.