అచ్చం అలాంటి సంఘటననే మా జీవితాల్లోనూ సంభవించింది. ఆ వైశాఖమాసపు అపరాహ్ణం మేము ఆ కొండవార లోయలోకి వెళ్ళినప్పుడు వర్షం పడ్డప్పుడు మేమిద్దరమే ఆ అడవిలో ఒంటరిగా గడిపాం. అప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు. కానీ ఇన్ని నెలల తర్వాత, నాకు తెలుస్తున్నది, ఆ పిల్లవాడు మరింత పిల్లవాడైపోయాడు, నేను మరింత పెద్దదాన్నైపోయాను.
ఆ వెన్నెల రాత్రులు-27
నా కళ్ళ ముందు ఆ ముఖం చెరిగిపోయింది. ఎటు చూసినా పొలాలు. పండిన వరిచేలు. వాటిమీద ఇంతలో ఎండ పడుతోంది, ఇంతలో మబ్బునీడ పడుతోంది. ఇద్దరు పిల్లలు ఆ పొలాల మధ్య గళ్ళకు గంతలు కట్టుకుని ఒకరినొకరు పట్టుకోడానికి పరుగెడుతున్నారు. వాళ్ళిద్దరూ గంతలు కట్టుకున్నారు, లుక్, విమలా, ఇద్దరూ, అంటే నువ్వు కూడా, కళ్ళకి గంతలు కట్టుకున్నావు-
ఆ వెన్నెల రాత్రులు-26
మరేమిటి? జీవితం నీ ఎదట నిల్చొందనీ, రానున్న నీ కాలమంతా ఆ అనుబంధానికే అంకితం కాబోతోందనీ ఏదో స్పష్టాస్పష్టంగా ఉండే ఎరుక. హటాత్తుగా నీ భవిష్యత్తు మీ ఇంటికొచ్చి, మీ వీథి గదిలో కూచుని, 'హలో మిస్' అని పలకరిస్తే, నువ్వు సోఫా లో కాలుమీద కాలు వేసుకుని కూచుని నిదానంగా మాట్లాడగలవా?
