శ్రీమతి మాధవి అమెరికాలో ఉంటారు. నేను ఫేస్ బుక్ లైవ్ లో ప్రసంగాలు మొదలుపెట్టినప్పణ్ణుంచి, ఆమె ఈ సిరీస్ చాలా శ్రద్ధగా వింటూ, తమ స్పందనని ఎప్పటికప్పుడు నా బ్లాగులో పోస్టు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్కస్ అరీలియస్ Meditations పైన ప్రసంగాలు మొదలుపెట్టాక, మొదటి ప్రసంగం విని, తమ అమ్మాయికి ఒక ఉత్తరం రాసారు. ఆ ఉత్తరాన్ని నాతో పంచుకున్నారు. ఆమె అనుమతితో ఆ ఉత్తరం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
మధువిద్య
నీ ఇంటికొచ్చినవారిచేతుల్లో ఈ పూట ఒక పూలగుత్తి పెట్టు. ఎవరికి తెలుసు? కొత్త సంవత్సరం వారిచరణాలతో నీ ఇంట అడుగుపెడుతూండొచ్చు.
స్టాలు నంబరు 360
ఒక రచయిత పుస్తకాల స్టాలు పెట్టుకుని అక్కడికి వచ్చే పాఠకుల్ని స్వాగతించడం ఒక అనుభవం. ఇంత విజువల్ మీడియా రాజ్యమేలుతున్నా, ఇందరు సినిమాతారలు ఇన్ని లక్షలమంది అభిమానుల్ని ఆకర్షించగలుగుతున్నా, ఇంకా, ఒక రచయితని చూడగానే మెరిసే కళ్ళతో అతడితో ఒక ఫొటో దిగాలని కోరుకునే పాఠకుల్ని నేను ప్రతిరోజూ పదుల సంఖ్యలో చూసాను. ..
