పుస్తక పరిచయం-50

పుస్తక పరిచయ ప్రసంగపరంపరలో భాగంగా మార్కస్ అరీలియస్ Meditations లో చివరి మూడు అధ్యాయాలు (10-12) పైన ఈ రోజు ప్రసంగం. మెడిటేషన్స్ పైన నా వ్యాఖ్యానం 'నీ శిల్పివి నువ్వే' నుంచి కూడా కొన్ని భాగాలు వినిపించాను. ఆ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.

ఒక సూఫీ రామదాసు

తన గురువునుండి పొందిన ఆ ప్రేమని ఇప్పుడాయన తిరిగి మళ్ళా ధారాళంగా వెదజల్లుతున్నారు కాబట్టే వేలాదిమంది శిష్యులు ఆయన సన్నిధి నుంచి స్పూర్తి పొందుతున్నారు. విద్యావంతులైన నాగరికులు తమ శక్తియుక్తులన్నీ మనుషుల్ని మతాల పేరిట విడదీయడానికి చూస్తుంటే, ఇక్కడ, ఈ సూఫీ సంప్రదాయ రామదాసును ఆశ్రయించుకున్న గ్రామీణులు మతాలకు అతీతమైన ఒక ప్రేమసమాజంగా జీవిస్తున్నారు.

కవులు రాసిన కథలు

ఏదో ఒక theme ని ఎంచుకుని కథాసంకలనాలు తేవడం తెలుగులో కొత్తకాదు. కాని, ఒక సంకలనం ఇంతగా ఆలోచనలో పడేయడం మాత్రం నాకైతే ఇదే మొదటిసారి. ఈ అంశాలమీదా, ఇటువంటివే తమకి స్ఫురించిన మరిన్ని అంశాలమీదా, కవిత్వ పాఠకులూ, కథాపాఠకులూ కూడా రానున్న రోజుల్లో తమ ఆలోచనలు మరింత వివరంగా పంచుకుంటారని ఎదురుచూస్తున్నాను.