నన్ను వెన్నాడే కథలు-16

ఒక చారిత్రిక సంఘటనని కథగా రాయాలంటే ఈ కథ ఒక నమూనా అని నాకు గుర్తుండిపోయింది. ఇప్పుడు నలభయ్యేళ్ళ తర్వాత, బంగారు రామాచారి పుణ్యమా అని, '23 హిందీ కథలు' మళ్ళా నా చేతుల్లోకి వచ్చాక, మళ్ళా ఈ కథ చదివాను. సందేహం లేదు, ఇది మణిపూస.