మందం మందం మధుర నినదైః

ఏమా అని తెరిచి చూద్దును కదా, గోదావరి గళం నుంచి ప్రవహిస్తున్నట్టు, మాష్టారి కంఠస్వరంలో కృష్ణకర్ణామృత శ్లోకాలు. అలానే వింటూ ఉండిపోయాను. సాయంకాల ప్రార్థన పూర్తయిందనిపించింది.

పుస్తక పరిచయం-31

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశంలోని రెండవ సర్గ గురించి ఈ రోజు ప్రసంగించాను. ఈనాటి ప్రసంగంలో ప్రధానంగా ఉత్తరమేఘం విశిష్టత, అది ఏ విధంగా కావ్యాన్ని పూర్వమేఘంతో కొనసాగిస్తున్నదీ, కవి ఉద్దేశిస్తున్న కావ్య వ్యంగ్యం ఏమై ఉండవచ్చు మొదలైన ఆలోచనలు పంచుకున్నాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.

ఉదారచరితులు

సాహిత్యం మీద మాత్రమే కాకుండా చరిత్ర, సమాజం, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద నేను పాతికేళ్ళుగా రాస్తూ ఉన్నాను. అటువంటి వ్యాసాలతో గతంలో సోమయ్యకు నచ్చిన వ్యాసాలు పేరిట ఒక సంపుటం కూడా వెలువరించాను. అదే క్రమంలో రాస్తూ వచ్చిన మరొక 36 వ్యాసాల్ని ఇలా 'ఉదారచరితులు' పేరిట మీకు అందిస్తున్నాను.