పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా మేఘసందేశం లోని రెండవ సర్గ, ఉత్తర మేఘంలో, అలకాపురి వర్ణన గురించి ప్రసంగం (2:3-7) చేశాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
వానపడ్డ రాత్రి
ఎప్పుడొచ్చాయో తెలీదు, ఒకరాత్రివేళ బాల్కనీలో, పోర్టికోలో, పచ్చిగడ్డివాసనతో ఆవుల మందలు.
మా నాన్నగారు
నేనెందరో వీరుల కథలు చదివాను. యోగుల కథలు, త్యాగుల కథలు చదివాను. కాని ఆ రోజు నేను మొదటిసారిగా ఒక వీరుణ్ణి, ఒక త్యాగిని, ఒక యోగిని చూసానని తెలుసుకున్నాను. అటువంటి మనిషిని నా జీవితంలో మరొకరెవరినీ ఇప్పటిదాకా చూడలేదని కూడా నాకు నేను చెప్పుకుంటున్నాను.
