పుస్తక పరిచయం-25

పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా ఇది ఇరవై అయిదవ ప్రసంగం. మీ ఆదరణ వల్ల, ఆసక్తి వల్ల మాత్రమే ఇన్ని ప్రసంగాలు చెయ్యగలిగాను. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మేఘసందేశం కావ్యం గురించిన పరిచయంలో భాగంగా నాలుగవ ప్రసంగం చేసాను. పూర్వమేఘంలోని 18-27 దాకా శ్లోకాల గురించి ఈరోజు ముచ్చటించుకున్నాం. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.

నిజమైన ప్రార్థన

కాని ఇప్పుడు నిజమైన ప్రార్థన అంటే ఏమిటో తెలిసింది. తెల్లవారి లేచి నువ్వు దైవాన్ని ఏమీ కోరుకోనక్కర్లేదు. నువ్వు చెయ్యవలసిందల్లా ధన్యవాదాలు చెప్పుకోవడమే. మరొక ప్రభాతం నీకు లభించినందుకు. మరొక రోజు నీకు దక్కినందుకు. మరొకసారి దైవాన్ని తలుచుకోగలినందుకు.

వికసిత వ్యక్తిత్వం

వేన్.డబ్ల్యు.డయ్యర్ సమకాలిక ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసవాదుల్లో అగ్రగణ్యుడు. ఆయన ఒకచోట ఇలా రాసుకున్నాడు. Change the way you look at things, and the things you look at change. తన జీవితకాలం పాటు బి.వి.పట్టాభిరాం ఈ సూత్రానికి ఉదాహరణగా జీవించాడని చెప్పవచ్చు.