ఆషాఢమేఘం

ఇన్నాళ్ళకి ఈ మృగశిర కార్తె మొదటిరోజున ఈ పుస్తకాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. దీన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రులకు మాన్సూను గిఫ్టుగా పంపించుకోవచ్చు. ఈ పుస్తకాన్ని నా చిరకాల మిత్రుడు, పాటలమాంత్రికుడు గంటేడ గౌరునాయుడుకి కానుక చేస్తున్నాను. ఇది నా 64 వ పుస్తకం

పుస్తక పరిచయం-22

పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు కాళిదాసు మేఘసందేశం కావ్యం పైన ప్రసంగించాను. సుప్రసిద్ధమైన ఈ కావ్యాన్ని చాలామంది ఒక ప్రణయగీతంగా గుర్తుపెట్టుకుంటారు. కాని ఇది ఒక శుభాకాంక్షగీతం

ఆ ఉత్తరంలో

ఆ ఉత్తరంలో రెండుపేజీలు చదివానో లేదో మధ్యలో ఖాళీకాగితంలాగా గ్రీష్మ ఋతువు. రంగుపోగొట్టుకున్న అక్షరాలు, దానిమీద ఒక వానజల్లు పడితే తప్ప తేటపడవు.