మంత్రమయపవనం

ఇంకా తెల్లవారకుండానే తలుపు తెరిచి చూస్తే బాల్కనీలో గులాబిమొక్కల్ని లాలిస్తున్న గాలి. తల్లికడుపులో దూరిమరీ పడుకున్న కుక్కపిల్లల్లాగా గాలి చేతుల్లో ఒదిగి కనులరమోడ్చిన మొగ్గలు.

ఒక సంభాషణ

కస్తూరి మురళీకృష్ణ గారు, కోవెల సంతోష్ కుమార్ గారు పోయిన ఆదివారం మా ఇంటికొచ్చారు. నా సాహిత్య వ్యాసంగం గురించి నాతో మాట్లాడించారు. ఆ సంభాషణని స్వాధ్యాయ ఛానల్లో పోస్టు చేసారు. మీ కోసం ఆ సంభాషణ లింకు ఇక్కడ పంచుకుంటున్నాను.

స్వర్ణయుగానికి స్వాగతం

కాని ఇప్పుడు ఈ ఉత్తరాలు చదివేక నాకు చాలా సంతోషంగానూ, ధైర్యంగానూ ఉంది. కవులు ఎప్పుడూ ఉంటారు, కాని కావలసింది సహృదయులు. వాళ్ళకి తన హృదయాన్నొక ఆశ్రయంగా మార్చగల తగుళ్ళ గోపాల్‌లాంటి సహృదయులు కనబడితే ఇదుగో, స్వర్ణయుగానికి స్వాగతం అనాలనిపిస్తుంది.