గొప్ప యోగుల, ఋషుల, దార్శనికుల, చింతకుల, బోధకుల, సాధకుల రచనలు కూడా మనల్ని ఎప్పటికప్పుడు పడిపోకుండా నిలబెడుతూ ఉంటాయి. అటువంటి మహాత్ముల రచనలు చదివినప్పుడు రాసుకుంటూ వచ్చిన నలభై వ్యాసాల సంపుటి ఇది. పరమయోగి శ్రీ వై.హనుమంతరావుగారి దివ్యస్మృతికి ఈ పుస్తకాన్ని కానుక చేస్తున్నాను. దీన్నిక్కడ మీరు డౌనులోడు చేసుకోవచ్చు. ఇటువంటి ఆసక్తి ఉన్న మిత్రుల్తో పంచుకోవచ్చు. ఇది నా 65 వ పుస్తకం.
