ఈ ఒక్క కథ అనే కాదు, దాదాపుగా చాలా కథలు నాకు పదేపదే ప్రేమ్ చంద్ ని గుర్తుకు తెస్తూ ఉన్నాయి. పుస్తకం చదవడం ముగించేక, 2013 లో ఆయన వెలువరించిన 'ఏక్ కహానీ కే తీన్ రంగ్' కి నేను రాసిన ముందుమాట మరోసారి తీసి చదివాను. ఆశ్చర్యంగా అప్పుడు కూడా నాకు ప్రేమ్ చంద్ గుర్తొస్తున్నాడనే రాసాను. అంటే నా అనుభూతి నిక్కమైనదేన్నమాట. నా epiphany స్థిరంగానే ఉందన్నమాట!
