చలంగారూ, జగ్గారావూ

కానీ మొన్న ఒక పుస్తకావిష్కరణ సభకి పిలిస్తే ఇదే చెప్పాను: మీరు నిజంగా మీ హృదయం ఏమి చెప్తోందో దాన్నే రాయదలుచుకుంటే, మీకు ఒక్క పబ్లిషరు కూడా దొరక్కూడదు, ఒక్క పాఠకుడు కూడా మీకు తన స్పందన చెప్పకూడదు అని. ఎందుకంటే పబ్లిషరు అంటూ ఒకడు దొరగ్గానే మీ రచన ఒక పెట్టుబడివస్తువుగా మారిపోతుంది.