రసవితరణ

పగలంతా ఒక ప్రపంచం. ఎండ, దుమ్ము హారన్లు, పెట్రోలు, పొగ, పరుగులుపెట్టే రోడ్లు రాత్రయ్యాక, నెమ్మదిగా లోకం సద్దుమణిగాక తీపిగాలుల రెక్కల మీద పాటలు ప్రవహిస్తాయి

పుస్తక పరిచయం-12

పుస్తక పరిచయం ప్రసంగాల పరంపరలో భాగంగా గతవారం నుంచి టాగోర్ సాహిత్యం గురించి ప్రసంగిస్తున్నాను. నిన్న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా టాగోర్ కవిత్వం గురించి, ముఖ్యంగా, ఆయన కవిత్వసాధనలో మొదటిదశ కవిత్వం (1881-1900) గురించి ప్రసంగించాను.

తొలి కూజితం

చాలా ఏళ్ళ కిందట బహుశా నా ఇరవయ్యేళ్ళప్పుడు ఒక తెల్లవారుజామున మగతనిద్రలో ఎవరివో మాటలు: మా అమ్మనెవరో ఏదో అడుగుతున్నారు మధ్యమధ్య మసకమసగ్గా నా పేరు.