ఈసారి ఫాల్గుణమాసం ఉపవాసదీక్ష పాటిస్తోంది ఆకాశపు మీనారు లోంచి కోకిల వేకువనే ప్రార్ధనకు పిలుస్తోంది.
ముద్రారాక్షసమ్
అలానే ఇంగ్లిషు అనువాదాలు కూడా చదవడానికి ప్రయత్నించానుగాని, ఆ నాటకంలోకి చొరబడటం దుర్భేద్యంగా ఉండింది. డా. ధూళిపాళ అన్నపూర్ణ గారు ఇటీవల ఆ నాటకానికి చేసిన తెలుగు అనువాదం 'విశాఖదత్త ముద్రారాక్షస నాటకం '(2025) నా చేతికందాక, ఇన్నాళ్ళకు నేను మొదటిసారిగా ముద్రారాక్షసాన్ని చదవగలిగాను. అది నా భాగ్యం.
తొలకరి చినుకులు
ఇది కూడా నా అనుభవంలో గ్రహించాను, ఒక పాఠశాల గురించిన దాదాపు యథార్థ ముఖచిత్రం ఆ పాఠశాల వార్షికోత్సవంలో కనిపించినట్టుగా మరెన్నడూ కనిపించదు.
