ముద్రారాక్షసమ్

అలానే ఇంగ్లిషు అనువాదాలు కూడా చదవడానికి ప్రయత్నించానుగాని, ఆ నాటకంలోకి చొరబడటం దుర్భేద్యంగా ఉండింది. డా. ధూళిపాళ అన్నపూర్ణ గారు ఇటీవల ఆ నాటకానికి చేసిన తెలుగు అనువాదం 'విశాఖదత్త ముద్రారాక్షస నాటకం '(2025) నా చేతికందాక, ఇన్నాళ్ళకు నేను మొదటిసారిగా ముద్రారాక్షసాన్ని చదవగలిగాను. అది నా భాగ్యం.