ఫాల్గుణమాసపు మామిడి పిందె

ఈ కవిత ఇప్పుడు కలకత్తాకి చేరిందంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించడం ఒక స్వభావంగా మారినవాళ్ళు తప్ప మరొకరెవరూ ఈ సున్నితస్పందనని గమనించలేరు, గమనించినా ఇలా ఒక పతాకలాగా పైకి ఎగరెయ్యలేరు.

పుస్తక పరిచయం-7

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా 14-2-2025 న బైరాగి ప్రేమకవితల పైన ప్రసంగించాను . ఈ అంశం మీద తెలుగులో ఇంతవరకూ ఇదే మొదటిప్రసంగం అని కూడా చెప్పవచ్చు.