మొత్తమంతా అద్వైతరూపమేనని ఎలా చెప్పగలను మొత్తమంతా ద్వైతరూపమేనని ఎలా చెప్పగలను మొత్తమంతా నిత్యమనీ, అనిత్యమనీ ఎలా చెప్పగలను నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.
అవధూత గీత-11
పగిలిన కుండలోపలి ఖాళీస్థలం ఆకాశంలో కలిసిపోయినట్టు యోగి దేహం విడిచినప్పుడు పరమసత్యంలో కలిసిపోతాడు.
అవధూత గీత-10
సారాసారాల్ని దాటి ఉన్నదేదో, రాకపోకల్ని దాటినదేదో ఆ నిర్వికల్ప, నిరాకుల, శివస్వరూపంగా ఉన్నది నేనే.
