అవధూత గీత-18

గురుశిష్యులనే ఆలోచన తొలగిపోతుంది ఉపదేశం గురించి చింతన తొలగిపోతుంది శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనేకాగా అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?

అవధూత గీత -17

మనస్సే అన్నిటినీ దాటినదీ, నిరంతరమైనది విశాలం, అవిశాలం అనే భేదాలు లేనిది మనస్సే నిరంతరం సమస్త శివప్రదమై ఉండగా ప్రత్యేకంగా ఏమని తలచడం? ఏమని చెప్పడం?

అవధూత గీత -16

ఒక ఇల్లుగాని, కుటీరంగాని, కుటుంబంగానీ లేకుండా సాంగత్యం, నిస్సాంగత్యం రెండూ కూడా లేకుండా ఇక్కడ ఎరుక, ఎరుకలేకుండటం రెండూ లేకుండా సర్వసముడివై కూడా మనసులో ఎందుకు శోకిస్తున్నావు?