ఆయన రాసిన మాటలు నాకెందుకు నచ్చాయంటే, చిత్రలేఖనంలో కాగితం తాలూకు తెలుపు కూడా ఒక ముఖ్యమైన భాగం అని ఆయన నమ్ముతున్నందువల్లా, నమ్మిందే ఇక్కడ రాసినందువల్లా.
మునిగితేలాం
'మునిగితేలాం' నా యాత్రాకథనాల నాలుగవ సంపుటం. ఆండాళ్ ప్రేమించిన శ్రీరంగనాథుడికి ఈ రచన సమర్పిస్తూ మీతో పంచుకుంటున్నాను. దీన్నిక్కడ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రుల్తో పంచుకోవచ్చు. ఇది నా 49 వ పుస్తకం.
ఆకాశం లాంటి సత్యం
అవధూత గీత ఆమూలాగ్రం ఒక జీవితానంద ప్రకటన. సంతోషం కానిదేదీ తన అనుభవంలోకి రాని మనిషి మాత్రమే చెప్పగల కవిత. ఈశావాస్య ఉపనిషత్తు 'ఈశావాస్య మిదం సర్వం 'అంది. అంటే ఈ ప్రపంచంలో ఈశ్వరుడు నెలకొనని తావంటూ లేదని చెప్పడం. అవధూతగీత ఆ ఈశ్వరుణ్ణి ఆనందమయుడిగా, అమృతమయుడిగా అనుభవానికి తెచ్చుకుంది. కాబట్టే 'జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహం' అని పరమసంతోషంతో ప్రకటిస్తూ ఉన్నది.
